Thursday, October 2, 2008

కోతి ఆట . .

Friday, September 19, 2008

నన్నుకదిలించిన దృష్య౦ . .

నిజంగా ఎన్నో మంచి పనులు చేస్తే గానీ మానవ జన్మ రాదంటారు కానీ కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని తనచుట్టూ ఉన్న జీవుల్ని బాధిస్తుంటారు. ఇవాళ ఒక దృష్య౦ చూసిన తరువాత మనుసు చలించింది. నిజంగా మనిషికి ఇతర జీవులపై ఇంత అమానుష ప్రవర్తన మనిషికి అవసరమా అని అనిపించింది. నేను చూసింది ఏమిటంటే మా పాఠశాల ఆవరణలో ఒక కుక్క శరీరంపై తీవ్రమైన గాయాలతో, తీవ్రంగా రోదిస్తూ బాధతో కనబడింది. దాని గాయాలు చిన్నవి కావు బహుషా కొన్ని ప్రాంతాలలో కాలి ఉంటుంది. ఆ గాయాలన్నీ విపరీతంగా దానిని బాధిస్తున్నట్లు దాని ప్రవర్తనను బట్టి అర్థం అయ్యంది. అది నా వైపు జాలిగా చూడటం మాత్రం నా మనసును కదిలించివేసింది. కాస్త మిగిలిన అన్నం పడేస్తే జీవితాంతం మననే యజమానిగా భావించే సాదు జంతువుపై ఇంత కసి ఎవరికుంటుందా అని అనుకుంటూనే అక్కడినుండి వెళ్ళిపోయాను. పరిస్థితిని చూసి జాలిపడటం తప్ప ఏమీ సహాయం చేయలేని పరిస్థతి (ఆ గ్రామ౦లో పశువుల ఆసుపత్రి లేదు) . నిజంగా మనిషి ఎంత స్వార్థపరుడు ? తను బ్రతకటం కోసం మొక్కల్ని, జంతువుల్ని అన్నింటినీ బాధిస్తున్నాడు. తనదైతే ప్రాణం కాని ఇతరులది కాదా ?? తనకైతే నొప్పి కానీ ఇతర జంతువులకది ఉండదా !!! నా దష్టిలో మాంసాహారం కూడా తప్పే (ఇది చదివే వారిని నొప్పిస్తే క్షమించండి). ఒక జంతువును చంపటం తినటం నిజంగా అనాగరికం కాదా!!!

ప్రకృతిలో ఇతర జంతువులను పరిశీలిస్తే నాలుకతో గతుకుతూ నీరు త్రాగేవన్నీ మాంసాహారులు. ఉదాహరణకు : కుక్కను, పిల్లిని, పులిని తీసుకొండి అవి నీటిని నాలుకతోనే గతుకుతాయి. అదే విధంగా పెదవులతో నీటిని త్రాగేవన్నీ శాఖాహారులు ఉదాహరణకు : కుందేలు, జింక వంటి వాటిని ఊహించుకొండి. చివరగా మానవుని విషయానికొస్తే మానవుడు పెదవులతో నీటిని త్రాగుతాడు కావున అతడు జన్మత: శాఖాహారి. మరి ఈ మాంసాహారం ఏమిటి ?? ఇదే విషయం మా స్టాఫ్ లో అంటే అందరు నన్నే విమర్శిస్తారు (సహజమే కదా . . ) ఒక ఉపాధ్యాయుడు వాటిని మనం తినకపోతే అవి మనపై దాడి చేస్తాయి అందుకే వాటిని తినాలి అ౦టారు. నిజంగా అందులో ఏమైనా అర్థం ఉందా !! కోళ్ళన్నీ వచ్చి ఈయనపై దాడి చేస్తాయా ఏమిటి ?? మేకలన్నీ కలిసి ఈయనగారు పనిచేసే చోటికి వచ్చి ఇతన్ని పీకేస్తాయా ?? ఈ కారణాలన్నీ అది మానటం మన తరం కాదు అనడానికి గుర్తుగా మనం కల్పించుకున్నవి. మన బలహీనతకు మనం ఇచ్చుకునే సర్టిఫికేట్. ప్రతీ జీవికి జీవించే హక్కు ఉంది. చిన్న చీమది ఎంత విలువైన ప్రాణమో పెద్ద ఏనుగుది కూడా అంతే విలువైనది. పాపం పుణ్యం అన్న కోణంలో కూడా మాంసాహారం సరియైనది కాదు. నేనీ టపా వ్రాసింది కేవలం మాంసాహారం మానమని కాదు. కానీ మనం చేసేది కరక్టేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలేమో అని నా అభిప్రాయం. ఇతర జీవులను బాధించటం మాని, కొంత భూతదయని చూపితే మంచిదని నా అభిప్రాయం ....

Thursday, September 18, 2008

కోడి గుడ్డు నుండి పిల్లవరకు . .

కోడి గుడ్డు నుండి పిల్ల బయటకు రావడానికి ౨౧ (ఇరవై ఒకటి) రోజుల సమయం పడుతుంది. ఈ మధ్యలో గుడ్డులో జరిగే మార్పులు చిత్రాల రూపంలో .....................................

























చివరకు .......................................
/
/
/



Saturday, June 21, 2008

ప్రపంచంలో విచిత్రమైన జంతువులు . . . .

ఎటి పీత
షూబిల్ కొంగ (బూటు ముక్కు కొంగ)
స్లోత్ ( చాలా నెమ్మదిగా నడిచే క్షీరదము )
టార్సియర్
నక్షత్రం ఆకారపు ముక్కు గల మోల్
ఆర్మడిలో
అయె - అయె
బ్లాబ్ చేప
డంబో ఆక్టోపస్
అంగోరా కుందేలు
ఎంపొరర్ టమారిన్
తొండం గల కోతి (మగ కోతికి మాత్రమే తొండం ఉంటుంది)
టాపిర్
అల్పకా