Friday, September 19, 2008

నన్నుకదిలించిన దృష్య౦ . .

నిజంగా ఎన్నో మంచి పనులు చేస్తే గానీ మానవ జన్మ రాదంటారు కానీ కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని తనచుట్టూ ఉన్న జీవుల్ని బాధిస్తుంటారు. ఇవాళ ఒక దృష్య౦ చూసిన తరువాత మనుసు చలించింది. నిజంగా మనిషికి ఇతర జీవులపై ఇంత అమానుష ప్రవర్తన మనిషికి అవసరమా అని అనిపించింది. నేను చూసింది ఏమిటంటే మా పాఠశాల ఆవరణలో ఒక కుక్క శరీరంపై తీవ్రమైన గాయాలతో, తీవ్రంగా రోదిస్తూ బాధతో కనబడింది. దాని గాయాలు చిన్నవి కావు బహుషా కొన్ని ప్రాంతాలలో కాలి ఉంటుంది. ఆ గాయాలన్నీ విపరీతంగా దానిని బాధిస్తున్నట్లు దాని ప్రవర్తనను బట్టి అర్థం అయ్యంది. అది నా వైపు జాలిగా చూడటం మాత్రం నా మనసును కదిలించివేసింది. కాస్త మిగిలిన అన్నం పడేస్తే జీవితాంతం మననే యజమానిగా భావించే సాదు జంతువుపై ఇంత కసి ఎవరికుంటుందా అని అనుకుంటూనే అక్కడినుండి వెళ్ళిపోయాను. పరిస్థితిని చూసి జాలిపడటం తప్ప ఏమీ సహాయం చేయలేని పరిస్థతి (ఆ గ్రామ౦లో పశువుల ఆసుపత్రి లేదు) . నిజంగా మనిషి ఎంత స్వార్థపరుడు ? తను బ్రతకటం కోసం మొక్కల్ని, జంతువుల్ని అన్నింటినీ బాధిస్తున్నాడు. తనదైతే ప్రాణం కాని ఇతరులది కాదా ?? తనకైతే నొప్పి కానీ ఇతర జంతువులకది ఉండదా !!! నా దష్టిలో మాంసాహారం కూడా తప్పే (ఇది చదివే వారిని నొప్పిస్తే క్షమించండి). ఒక జంతువును చంపటం తినటం నిజంగా అనాగరికం కాదా!!!

ప్రకృతిలో ఇతర జంతువులను పరిశీలిస్తే నాలుకతో గతుకుతూ నీరు త్రాగేవన్నీ మాంసాహారులు. ఉదాహరణకు : కుక్కను, పిల్లిని, పులిని తీసుకొండి అవి నీటిని నాలుకతోనే గతుకుతాయి. అదే విధంగా పెదవులతో నీటిని త్రాగేవన్నీ శాఖాహారులు ఉదాహరణకు : కుందేలు, జింక వంటి వాటిని ఊహించుకొండి. చివరగా మానవుని విషయానికొస్తే మానవుడు పెదవులతో నీటిని త్రాగుతాడు కావున అతడు జన్మత: శాఖాహారి. మరి ఈ మాంసాహారం ఏమిటి ?? ఇదే విషయం మా స్టాఫ్ లో అంటే అందరు నన్నే విమర్శిస్తారు (సహజమే కదా . . ) ఒక ఉపాధ్యాయుడు వాటిని మనం తినకపోతే అవి మనపై దాడి చేస్తాయి అందుకే వాటిని తినాలి అ౦టారు. నిజంగా అందులో ఏమైనా అర్థం ఉందా !! కోళ్ళన్నీ వచ్చి ఈయనపై దాడి చేస్తాయా ఏమిటి ?? మేకలన్నీ కలిసి ఈయనగారు పనిచేసే చోటికి వచ్చి ఇతన్ని పీకేస్తాయా ?? ఈ కారణాలన్నీ అది మానటం మన తరం కాదు అనడానికి గుర్తుగా మనం కల్పించుకున్నవి. మన బలహీనతకు మనం ఇచ్చుకునే సర్టిఫికేట్. ప్రతీ జీవికి జీవించే హక్కు ఉంది. చిన్న చీమది ఎంత విలువైన ప్రాణమో పెద్ద ఏనుగుది కూడా అంతే విలువైనది. పాపం పుణ్యం అన్న కోణంలో కూడా మాంసాహారం సరియైనది కాదు. నేనీ టపా వ్రాసింది కేవలం మాంసాహారం మానమని కాదు. కానీ మనం చేసేది కరక్టేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలేమో అని నా అభిప్రాయం. ఇతర జీవులను బాధించటం మాని, కొంత భూతదయని చూపితే మంచిదని నా అభిప్రాయం ....

3 comments:

మధు said...

నేను మానేస్తున్నాను............
-------------------------
నేను పెద్ద మాంసాహరిని కాదుగాని, ఎప్పుడో ఒక్క సారి తింటూవుంటాను. తిన్న తరవాత ప్రతీసారి, మానేస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది. తిన్న కొద్దిసేపు రుచి కోసం జీవ హింస తప్పు అనిపిస్తుంది. కానీ మనకా ఇంద్రీయాలని కంట్రోల్ చేయడం ఇంకా రాలేదు. ఈసారి 'సంకల్పం' గొప్పది అని నమ్ముతున్నాను. నేను సంకల్పించు కొన్నాను.(మహేష్ బాబు సినిమాలో డైలాగ్ లే). మనం మానేశాం. మాంసాహారం మానేశాం అబ్బాయ్!(క్షమించాలి మిమ్మల్ని కాదు.. ఉతపదం లే).

మనుషులు జన్మతహ శాఖాహారులు అంటుంటే... నాకు మరో విషయం గుర్తు వచ్చింది. మనం శాఖాహారం తిన్నా బ్రతక గలుగుతాము. అంటే జీవ హింస చేయటం దేనికి.

నేను ఎవరిని ఉద్దేశించి రాసినవి కాదు. ఎవరైన నొచ్చుకొని ఉంటే క్షమించాలి .

Anonymous said...

excellent and veritable views.Yes, it is true,
people are increasingly becoming non-vegetarian
but they say they are refined and sophisticated
They are never compassionate towards the flora
and fauna.Why don't they think a little? These
helpless and innocent creatures are at stake
and falling a pray to such destructive minds.

వర్మ said...

Anonymous garu chala baaga chepparu ...... mee peru kuda rasi unte bagundedi ...... VARMA

Post a Comment